వివాహానికి సర్పంచ్ ఆర్థిక సహాయం.. 25,116 రూపాయలు అందజేత
వివాహానికి సర్పంచ్ ఆర్థిక సహాయం.. 25,116 రూపాయలు అందజేత
వికారాబాద్, జూన్ 12 (ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం కొలుకుంద వాసి షేక్ యూసుఫ్ కూతురు వివాహం హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో జరగగా, ఆ వేడుకకు గ్రామ సర్పంచ్, తెలంగాణ గ్రామ సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి కరణం కీర్తి రామకృష్ణ హాజరయ్యారు. ఆయనతో పాటు నాయకులు, కరణం రామకృష్ణ దంపతులు కూడా పాల్గొని పెళ్లికూతురుకు రూ. 25,116 అందజేశారు.
ఈ సందర్భంగా కరణం కీర్తి రామకృష్ణ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా 6 గ్యారంటీల అమలులో ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎవరి వివాహం జరిగినా రూ. 25,116 అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మహేందర్ రెడ్డి, కుద్బుద్దిన్ బాబు, జహంగీర్, కాజా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
