Teaser I టీజర్‌తోనే హైప్ పెరిగింది!

Teaser I టీజర్‌తోనే హైప్ పెరిగింది!

teaser I ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: విభిన్న కథాంశాలతో సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే నటుడు సుమంత్ మరోసారి ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా సోషియో ఫ్యాంటసీ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్ నేడు విడుదలైంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా వచ్చిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.

వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ సాగే మిస్టరీ నేపథ్యంలో టీజర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. ఆలయ వాతావరణం, సస్పెన్స్‌ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత బలం చేకూర్చింది.

ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో సుమంత్ పాత్రపైనే ఎక్కువ ఫోకస్ కనిపించగా.. టీజర్‌తో ఈ సినిమాలో భారీ తారాగణం ఉందనే విషయం స్పష్టమైంది. ఐశ్వర్యా రాజేశ్, మాళవిక నాయర్, మీనాక్షి, బ్రహ్మానందం, మంజు భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగడంతో పాటు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని స్క్రీన్ ప్లే దర్శకత్వం సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అని మూవీ టీమ్ చెబుతోంది. దీనికి సుబ్రమణ్యపురం, లక్ష్య సినిమాలకు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించగా స్క్రీన్ ప్లే సత్య రిషి అందించారు.

టీజర్‌ను చూస్తే నిర్మాతలు మధు కలిపు, లక్ష్మణ్ ఖర్చుకు వెనకాడకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాకు ఎడిటర్‌ జునైద్ సిద్ధిక్, రచయిత ఎన్‌ ఎన్‌ మురళీధర్. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్‌తోనే సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. డివోషనల్ థ్రిల్లర్ జానర్‌కు మిస్టరీ టచ్ జోడించడంతో ఈ సినిమా సుమంత్ కెరీర్‌లో మరో ప్రత్యేక ప్రయత్నంగా నిలుస్తుందా అన్న చర్చ మొదలైంది.

CLICK HERE FOR READ MORE : ఇంట్రెస్టింగ్ గా స్ల‌మ్ డాగ్..

CLICK HERE FOR MORE

Leave a Reply