Srisailam Traffic Jam | బురదలో ఇరుక్కున్న ట్రావెల్స్ బస్సు..
Srisailam Traffic Jam | బురదలో ఇరుక్కున్న ట్రావెల్స్ బస్సు..
Srisailam Traffic Jam | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : శ్రీశైలం వెళ్లే భక్తులు, ప్రయాణికులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బురదలో ఇరుక్కుపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో దోమలపెంట చెక్‌పోస్ట్ నుంచి సున్నిపెంట వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఇటీవల కురిసిన వర్షాలతో రహదారి పక్కన బురద పేరుకుపోయింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్యామ్ వ్యూ పాయింట్ టర్నింగ్ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో బురదలో కూరుకుపోయింది. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
వారాంతం కావడంతో శ్రీశైలం దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు బయలుదేరారు. బస్సు నిలిచిపోవడంతో కార్లు, బస్సులు, ఇతర వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. బస్సును బయటకు తీసేందుకు యంత్రాలను వినియోగించినట్లు సమాచారం.
