ఆలయ నిర్మాణానికి పూర్వ విద్యార్థుల విరాళం
ఆలయ నిర్మాణానికి పూర్వ విద్యార్థుల విరాళం
భీమ్‌గల్ టౌన్ (ఆంధ్రప్రభ): స్వయంభు సిద్ధి వినాయక ఆలయ నిర్మాణానికి పూర్వ విద్యార్థులు చేయూత అందించారు. 2004–05 విద్యా సంవత్సరానికి చెందిన శ్రీ భారతి విద్యాలయం పూర్వ విద్యార్థులు ఆలయ నిర్మాణం కోసం రూ.30,000 విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది దాతలు ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో సుంకరి సురేష్, గంగ నరేష్, వాకా మహేష్, కొండూరు నరేష్, తిరునగిరి రాకేష్‌తో పాటు 2004–05 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
