రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
చిలుపూర్, ఆంధ్రప్రభ: జనగామ జిల్లా చిలుపూర్ మండలం చిన్న పెండ్యాల గ్యాస్ కంపెనీ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్లు గ్రామానికి చెందిన గాండ్ల రమేష్ (50) ఆదివారం చాగల్లు నుంచి రాంపూర్ ఇండస్ట్రీకి బైక్‌పై పనికి వెళ్తుండగా చిన్న పెండ్యాల వద్ద బైక్ అదుపుతప్పి జారి పడింది. ఈ ప్రమాదంలో రమేష్ తలకు, చేతులకు తీవ్ర గాయాలు కాగా, అధిక రక్తస్రావం జరిగింది.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈఎంటీ హరికృష్ణ, పైలెట్ రాజన్న సకాలంలో స్పందించి బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్‌లోనే అత్యవసర వైద్యం కొనసాగిస్తూ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం రమేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
