7thJune2026 | తిరుమల సమాచారం..

7thJune2026 | తిరుమల సమాచారం..

7thJune2026 | తిరుమలలో భక్తుల రద్దీ..
శ్రీ‌వారి దర్శనానికి 20గంటలు

7thJune2026 | తిరుమల, ఆంధ్రప్రభ: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనానికి ప్రస్తుతం సుమారు 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.

శనివారం ఒక్కరోజే 90,107 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 52,236 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూల విక్రయాలు కూడా భారీగా జరిగాయి. శనివారం 4.35 లక్షల లడ్డూలు విక్రయించినట్లు సమాచారం. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూలైన్లలో తాగునీరు, అన్నప్రసాదం, ఇతర సౌకర్యాలు అందిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

CLICK HERE TO READ Temple Rush | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

CLICK HERE TO READ MORE

Leave a Reply