General Passport | పాస్ పోర్ట్ ను రెన్యువ‌ల్ చేసుకున్న కెసిఆర్ ..

హైద‌రాబాద్ – బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ త‌న పాస్ పోర్ట్ ను రెన్యువ‌ల్ చేసుకున్నారు.. దీనికోసం ఆయ‌న ఎర్ర‌వ‌ల్లి నుంచి సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాల‌యానికి కారులో నేటి ఉద‌యం చేరుకున్నారు.. గ‌తంలో ఉన్న డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ ను సాధార‌ణ పాస్ పోర్టు గా ఆయ‌న మార్చుకున్నారు.. ఆయ‌న‌తో పాటు స‌తీమ‌ణి శోభ పాస్ పోర్ట్ ను కూడా రెన్యువల్ చేశారు.. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ల‌ను ఆయ‌న అధికారుల‌కు అంద‌జేశారు.. అంత‌కు ముందు పాస్ పోర్ట్ కార్యాల‌యానికి చేరుకున్న కెసిఆర్ కు అక్క‌డి అధికారులు సాద‌ర‌పూర్వ‌క స్వాగ‌తం ప‌లికారు.


అనంత‌రం ఆయ‌న తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. . అక్కడ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీల, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు సమావేశానికి హాజరుకానున్నారు.

Leave a Reply