LPG Cylinder Price Hike | మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర

LPG Cylinder Price Hike | మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర

LPG Cylinder Price Hike | 14.2 కేజీల సిలిండర్‌పై రూ.29 పెంపు..

అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమలు

మార్చిలోనే రూ.60 పెంచిన చమురు సంస్థలు

మూడు నెలల్లో రెండోసారి పెంపు..

LPG Cylinder Price Hike | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెను భారం పడింది. 14.2 కేజీల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరపై రూ.29 పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు ఈ తాజా పెంపు మరింత భారంగా మారనుంది. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడనుంది.

కాగా, గత మూడు నెలల వ్యవధిలో వంటగ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చి 7న కూడా 14.2 కేజీల సిలిండర్‌పై రూ.60 పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరో రూ.29 పెంపుతో గృహ వినియోగదారులపై మొత్తం భారం మరింత పెరిగింది.

గ్యాస్ ధరల వరుస పెంపులతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో వంటగ్యాస్ ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply