VRO Suicide | మృతదేహంతో కలెక్టరేట్ ఎదుట ధర్నా

VRO Suicide | మృతదేహంతో కలెక్టరేట్ ఎదుట ధర్నా

అధికారుల ఒత్తిడే కారణమంటూ సూసైడ్ నోట్..

VRO Suicide | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వెంకయపల్లె గ్రామానికి చెందిన వీఆర్‌వో మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఇంటి బయట ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆయన ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో అధికారుల ఒత్తిడే తన మరణానికి కారణమని మహమ్మద్ హుస్సేన్ పేర్కొన్నట్లు సమాచారం. విధుల నిర్వహణలో ఎదురైన వేధింపులు, ఒత్తిళ్లను తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వివరించినట్లు తెలుస్తోంది.

ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీఆర్‌వోలు, మృతుడి కుటుంబ సభ్యులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అంశాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Leave a Reply