భూక్య తండా మృతురాలి కుటుంబాన్ని పరామర్శ
భూక్య తండా మృతురాలి కుటుంబాన్ని పరామర్శ
మరిపెడ, ఆంధ్రప్రభ:
మండలంలోని భూక్య తండాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన మాలోత్ నీల శారద కుటుంబ సభ్యులను గురువారం డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.
భూక్య తండా గ్రామంలో మంగళవారం రాత్రి మాలోత్ నీల శారద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మృతురాలి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
