సుపరిపాలనకు రెండేళ్లు….

సుపరిపాలనకు రెండేళ్లు….

సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు..

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజలను పీడించి వేధించి విధ్వంసం సృష్టించి,రాష్ట్ర పురోభివృద్ధిని తిరోగమనం దిశగా తీసుకెళ్లిన ఐదేళ్ల అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించి నేటికి రెండేళ్లని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్ నగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ
సంక్షేమం అభివృద్ధికి సంకెళ్లు వేసి,బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల జీవన విధానంపై పెను విద్వేషం రగిలించిన గొడ్డలి పార్టీ ముఠాకు ఘోరీ కట్టి నేటికి రెండేళ్లని అన్నారు.పెట్టుబడిదారులను బెదిరించి, పరిశ్రమలను తరిమేసి యువత భవితను ప్రశ్నార్థకం చేసిన పాపాల భైరవుడి పాలనకు పాడే కట్టి నేటికి రెండేళ్లని అన్నారు.

వెన్నుపోట్లు, గుండెపోట్లు, గొడ్డలి పోట్లు జగన్ రెడ్డి పేటెంట్లన్నారు. ప్రజాధనాన్ని ఐదేళ్ల పాటు దోచుకున్న బందిపోటు దొంగలకు ఓటుతో బుద్ధి చెప్పి నేటికి రెండేళ్లని అన్నారు. సంక్షేమం అభివృద్దే అజెండాగా పాలన సాగిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక చెప్పిన హామీలనే కాకుండా చెప్పని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజారంజక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు రెండేళ్లన్నారు. సూపర్ సిక్స్ హామీలను చెప్పిన సమయానికి అమలు చేసి సూపర్ హిట్ చేశామని పేర్కొన్నారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి ఈ 24 నెలల్లోనే రూ.66 వేల కోట్లు ఖర్చు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు ఆర్థికంగా కొండంత అండగా నిలిచామని చాటి చెప్పారు. రూ.10,090 కోట్ల భారీ వ్యయంతో 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.15 వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచామని తెలిపారు.మహిళా శక్తీకరణే ధ్యేయంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, ప్రతి మహిళా నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు ఆదా చేసుకునేలా ఆర్థిక భరోసా కల్పించామని గుర్తు చేశారు.
పేద గృహిణులపై వంటగ్యాస్ భారం తగ్గిస్తూ ఏటా 3ఉచిత సిలిండర్ల పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.

దవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా 269 అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5 కే నాణ్యమైన భోజనాలను మూడు పూటల అందజేస్తున్నామని తెలిపారు. 46 లక్షల మంది రైతులకు మూడు విడతల్లో రూ.8,985 కోట్ల సాయం అందించామని తెలిపారు.సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ పారదర్శకంగా ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టామని అన్నారు. మైనారిటీల సంక్షేమానికి రూ.3,670 కోట్ల రికార్డు నిధులు కేటాయించామని పేర్కొన్నారు.గత ప్రభుత్వం నిలిపివేసిన రూ.21 వేల కోట్ల సుదీర్ఘ కాల బకాయిలను ఉద్యోగులకు చెల్లించి వారి నమ్మకాన్ని గెలుచుకున్నామని అన్నారు.గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయించి, అమరావతిని ఏకైక, శాశ్వత భవిష్యత్ నగరంగా ర్చిదిద్దుతున్నామని అన్నారు.గుంతల రహిత రహదారులే లక్ష్యంగా రూ.861 కోట్లతో 20,060 కి.మీ. రహదారులకు మరమ్మతులు పూర్తి చేశాం. మరో రూ.3 వేల కోట్లు రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

దేశంలో వచ్చిన అత్యధిక పెట్టుబడుల్లో ఏపీకే 25.3 శాతం వచ్చేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు.గత ఐదేళ్ల గొడ్డలి పార్టీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో చట్టం, న్యాయం, పరిపాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై, అరాచకత్వం తాండవించిందని అన్నారు.గంజాయి నిర్మూలనకు ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రజల శాంతి భద్రతలకు పెద్దపీట వేశామని అన్నారు. చీకటి పాలన నుండి ఆంధ్రప్రదేశ్ను రక్షించి, కేవలం 24 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపిస్తున్నామని పేర్కొన్నారు.

Leave a Reply