డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు : కూటమి నేతలు
డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు : కూటమి నేతలు
గుడివాడలో ఘనంగా కూటమి విజయోత్సవాలు.. ‘రామన్న రాజ్యానికి రెండేళ్లు’ అంటూ నినాదాలు
నెహ్రూ చౌక్‌లో టపాసులు, మిఠాయిలతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల సంబరాలు
కొడాలి దుష్టపాలన అంతం.. గుడివాడ గడ్డ టీడీపీ అడ్డా అంటూ హోరెత్తిన నినాదాలు
గుడివాడ, ఆంధ్రప్రభ : డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని గుడివాడ కూటమి నాయకులు అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాము నేతృత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గుడివాడలో కూటమి పార్టీల శ్రేణులు గురువారం ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాయి. ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం నుంచి పట్టణ ప్రధాన రహదారుల్లో కూటమి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.

“కొడాలి దుష్టపాలన అంతం.. రామన్న రాజ్యానికి రెండేళ్లు”, “గుడివాడ గడ్డ టీడీపీ అడ్డా”, “జై చంద్రబాబు” అంటూ కార్యకర్తలు నినాదాలతో గుడివాడ రోడ్లలో హోరెత్తించారు. నెహ్రూ చౌక్ సెంటర్లో టపాసులు కాలుస్తూ, మిఠాయిలు తినిపించుకుంటూ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులుమాట్లాడుతూ.. రాష్ట్రంలో గత అరాచక పరిపాలన అంతమై రామరాజ్యం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిందన్నారు. చంద్రబాబు సారథ్యంలో, పవన్ కళ్యాణ్, కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సంపూర్ణ మద్దతుతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
కేంద్రం సహకారంతో పోలవరం, అమరావతి నిర్మాణాలు, మెగా డీఎస్సీ లాంటి పథకాలతో పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. రాక్షస పాలన పోయిందనే ఆనందంలో రాష్ట్ర ప్రజానీకం ఉందని, ఇది నిజమైన పండుగ అన్నారు.
గుడివాడలో ప్రజలు 53 వేల పైచిలుకు మెజారిటీతో అరాచక పాలనను అంతమొందించి వెనిగండ్ల రామును గెలిపించారని గుర్తుచేశారు. గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాబోయే రెండేళ్లలో గుడివాడ రూపురేఖలు మారి బ్రహ్మాండమైన పట్టణంగా తయారవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
బైపాస్ రోడ్లు, నెహ్రూ చౌక్, ప్రతి వార్డు అభివృద్ధి చెందుతున్నాయని, గతంలో వర్షం వస్తే నడుము లోతు నీళ్లతో ఉన్న బస్టాండ్‌ను ఇప్పుడు సుందరంగా తయారు చేస్తున్నామన్నారు. ప్రజల సహకారం చూస్తుంటే 2047 వరకు ఇదే కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
2019లో చేసిన చిన్న తప్పు వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, 2024లో విజ్ఞతతో రామును, చంద్రబాబును గెలిపించుకున్నామన్నారు. కేవలం 11 సీట్లు వచ్చిన ప్రతిపక్షాలు ప్రజలు ఛీత్కరించినా, వైసిపి నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. వెన్నుపోటు దినం అంటూ రోడ్ల మీద తిరుగుతున్నారని, మీ నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయలేదని, ఇప్పటికైనా జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని హితవు పలికారు.
ముందుగా మెయిన్ రోడ్డులో జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు, నెహ్రూ చౌక్ సెంటర్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు కూటమి నాయకులు నివాళులు అర్పించారు.
విజయోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు,గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ, రూరల్, నందివాడ మండలాల టిడిపి అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, వాసే మురళి, దానేటి సన్యాసిరావు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సురే లక్ష్మీనారాయణ గాంధీ, కార్పొరేషన్ డైరెక్టర్లు గోకవరపు సునీల్, మజ్జాడ నాగరాజు, నియోజకవర్గ పరిధిలోని టిడిపి నాయకులు లింగం ప్రసాద్,కొడాలి రామరాజు, యార్లగడ్డ సుధారాణి, షేక్ జానీ, లోయ విజయ్, ఉప్పల వెంకటేశ్వరరావు, చీకటి శేషగిరి, గుత్తా చంటి, అంగడాల వీర్రాజు, జోన్స్ దయానంద్,రామిదేని వేణుబాబు, సయ్యద్ జబీన్, గొర్ల శ్రీలక్ష్మి, మాదాల సునీత, కొల్లి రమ్య చౌదరి, సిరిపురపు తులసీ రాణి, కంచర్ల సుధాకర్, సింగాల రాధాకృష్ణ, అందుగుల యేసు పాదం, అంజిరెడ్డి, పెద్ది బోయిన రాజు, ప్రశాంతి, మల్లికా బేగం, వంగపండు ఆదినారాయణ, దేవాది నాగేశ్వరరావు, ఇమ్మానుయేలు, తిరుమలరెడ్డి, రసీదు బేగ్, నూర్, జయశ్రీ, లలిత,అట్లూరి స్వరూప్, మిక్కిలినేని రమేష్, వడ్డాది నాగరాజు, అబ్దుల్ సత్తార్, జనసేన దుర్గ, టిడిపి, జనసేన, బిజెపి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు.
