కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  • ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

కడెం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

కడెం మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. మండల కాంగ్రెస్ నాయకుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, పార్టీ పట్ల మరింత విశ్వాసం పెంపొందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మండల కాంగ్రెస్ నాయకుడు బొడ్డు గంగన్న మాట్లాడుతూ, మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు కావడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషణ్, నిర్మల్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ గుప్తా, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ భవాని, ఆర్టీఏ సభ్యుడు మల్లేష్ యాదవ్, డీసీసీ సభ్యుడు గొల్ల వెంకటేష్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బి. రమేష్ వర్మ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యాంసుందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముడికె మల్లేష్ యాదవ్, దస్తూరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామడుగు రమేష్‌రావు, పెద్దూర్-కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేంకల శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు ఎండీ వాజిద్ ఖాన్, బబ్లు, కొండాపురం లక్ష్మణ్, మూసుకు రాజేందర్ రెడ్డి, ఎండీ సలీం, లోక నరేందర్ రెడ్డి, ఆకుల లచ్చన్న, డి. రాజశేఖర్, తొట్ల గంగన్న, కమలాకర్ బ్రహ్మచారి, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పి. సంపత్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, సామాజికవేత్త సీహెచ్ రాజేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply