హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా
పాయకాపురం, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ద్వారా ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని వైసీపీ ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా విమర్శించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టనున్న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం సింగ్‌నగర్ ప్రాంతంలోని తన కార్యాలయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు విజయవంతం చేయాలని రుహుల్లా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజు, నెరేళ్ల శివప్రసాద్, జిలానీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
