మంగపేట డిప్యూటీ తహశీల్దార్ బదిలీ..
మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట డిప్యూటీ తహశీల్దార్ జే.మల్లేశ్వరరావును జిల్లా ఉన్నతాధికారులు బదిలీ చేశారు. సాధారణ బదిలీలలో భాగంగా మంగపేట డిప్యూటీ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న మల్లేశ్వరరావును ములుగు సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ గా బదిలీ చేస్తూ ఉన్నతధికారులు ఉత్తర్వులు జారీ చేశాను. సుమారు మూడేళ్ల క్రితం మంగపేట డిప్యూటీ తహసీల్దారుగా విధులలో చేరిన మల్లేశ్వరరావు తన పరిధిలోని రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంతో పాటు మంగపేట తహశీల్ కార్యాలయ అధికారుల, సిబ్బందితో పాటు మండల ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నారు.
