Women’s Under-18 Asia Cup Hockey | టేబుల్ టాప్ లో భారత్ !!

Women’s Under-18 Asia Cup Hockey | టేబుల్ టాప్ లో భారత్ !!
- కొరియాపై భారత్ ఘనవిజయం..
మహిళల అండర్-18 ఆసియా కప్ హాకీ (Women’s Under-18 Asia Cup Hockey) టోర్నమెంట్లో భారత జట్టు తన విజయ పంథాను కొనసాగిస్తోంది. ఈరోజు (ఆదివారం) జరిగిన పూల్-ఏ రెండో మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో బలమైన కొరియాపై ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో మలేషియాను చిత్తు చేసిన భారత్, తాజా విజయంతో పూల్-ఏ పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.
వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న భారత జట్టు, జూన్ 2న జరిగే తమ తదుపరి (చివరి) పూల్-ఏ మ్యాచ్‌లో సింగపూర్‌తో తలపడనుంది.

