గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

  • వివరాలు తెలియజేయాలని పోలీసుల విజ్ఞప్తి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని షామ్స్ ఫంక్షన్ హాల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి రోడ్డుపక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని సమాచారం అందడంతో అచ్చంపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.

మృతుడి ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు 8712657732, 8712657731 నంబర్లకు సమాచారం అందించాలని అచ్చంపేట ఎస్సై సద్దాం విజ్ఞప్తి చేశారు.

Leave a Reply