Rohit Rao | రోహిత్‌రావుకు జగ్గారెడ్డి కీలక సూచనలు

Rohit Rao | రోహిత్‌రావుకు జగ్గారెడ్డి కీలక సూచనలు

Rohit Rao | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావుకు కీలక రాజకీయ సూచనలు చేశారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే రెండోసారి విజయం సాధించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో జరిగిన భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మైనంపల్లి హన్మంతరావుతో కలిసి గాంధీభవన్‌కు వచ్చిన రోహిత్‌రావుతో జగ్గారెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. తొలి విజయంతో ఆగిపోకుండా, రెండో ఎన్నికను కూడా మొదటి ఎన్నికల మాదిరిగానే భావించి కష్టపడాలని సూచించారు. రెండోసారి గెలుపే రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అవుతుందని అన్నారు.

రాజకీయంగా ప్రజల మధ్య నిరంతరం ఉండాలని, నియోజకవర్గంపై పూర్తి దృష్టి పెట్టాలని జగ్గారెడ్డి సూచించారు. అనంతరం తన నివాసానికి రావాలని జగ్గారెడ్డిని ఎమ్మెల్యే రోహిత్‌రావు ఆహ్వానించారు. ఈ భేటీ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Leave a Reply