అంబలి పంపిణీ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అంబలి పంపిణీ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
జైనూర్, ఆంధ్రప్రభ:
కొవలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రంతో పాటు చలివేంద్రాన్ని ఆశిఫాబాద్ ఎమ్మెల్యే కొవలక్ష్మి ప్రారంభించారు. ఎమ్మెల్యే నాయకులతో సర్పంచ్లతో కలిసి ప్రజలకు స్వయంగా అంబలి పంపిణీ చేశారు. అంబలి పంపిణి కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొవలక్ష్మి మాట్లాడుతూ వారపు సంతకు వచ్చే ప్రజలకు దాహం తీర్చేందుకు అంబలితోపాటు చల్లని నీళ్లు అందించాలని మానవత్వ దృక్పథంతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. అంబలి పంపిణి కేంద్రానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి అంబలి స్వీకరించి తాగారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాయకులు మహిళా సర్పంచులు అంబలి పంపిణీ కేంద్రానికి వచ్చిన ప్రజలకు స్వయంగా అంబలి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమ0లో ఆసిఫాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప హన్ను పటేల్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్ నాయక్, మహిళా సర్పంచు లు లు మడావి కౌసల్య భీమ్రావు, కుమ్ర యశోద కేశవరావు, బాండేర్ సర్పంచ్ కుమ్ర భీమ్రావు, జ0గాం మాజీ సర్పంచ్ కుమ్ర శ్యామ్ రావు, బిఆర్ఎస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
