Horrific incident | 500 మీటర్ల దూరం బోనెట్ పై…

Horrific incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మైసూరులో డబ్బుల వివాదం భయానక ఘటనకు దారితీసింది. అప్పు వ్యవహారంపై జరిగిన వాగ్వాదం అనంతరం ఓ వ్యక్తిని కారు బోనెట్ పై వేలాడదీసుకుని సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
మహాదేవ్ అనే వ్యక్తి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ధనుంజయ్‌ను నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ధనుంజయ్ కారులో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా.. మహాదేవ్ అడ్డుకునేందుకు కారు బోనెట్‌పైకి ఎక్కాడు.
అయినా కారును ఆపకుండా ధనుంజయ్ వేగంగా నడపడంతో.. మహాదేవ్ ప్రాణభయంతో బానెట్‌ను పట్టుకుని వేలాడుతూ వెళ్లాడు. సుమారు అర కిలోమీటరు దూరం వరకు ఈ ఘటన కొనసాగినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
