రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి

రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి
డోంగ్లి, ఆంధ్రప్రభ:
దేశ సమగ్రత, ఆధునిక భారత నిర్మాణం కోసం మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయ్ అన్నారు. డోంగ్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మండల అధ్యక్షుడు గజానంద్ దేశాయ్ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గజానంద్ దేశాయ్ మాట్లాడుతూ.. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, సాంకేతిక (టెక్నాలజీ) రంగానికి బలమైన పునాదులు వేసిన దార్శనిక నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ బస్వరాజ్ పటేల్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లక్ష్మణ్ బచావార్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ యూనుస్ పటేల్, సర్పంచ్లు సంగ్రామ్ పటేల్, బస్వరాజ్ పటేల్, శ్రీధర్, తుకారాం పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు విలాస్ పటేల్, మధయాప్ప స్వామి, విలాస్ గైక్వాడ్, వసంత్ పటేల్, శంకర్, ముల్తాన్, ఇసా, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.
