పరీక్ష తేదీలో మార్పు

ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్‌లో చేంజ్
ఈ నెల 28 వ తేది న బక్రీద్ పండుగ సందర్భంగా మార్పు
నంద్యాల బ్యూరో మే 21 ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యారు. జూన్ 4వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈనెల 28వ తేదీన బక్రీద్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. బక్రీద్ పండుగ కారణంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో చిన్న మార్పు చేశారు. పాత షెడ్యూల్ ప్రకారం బక్రీద్ సెలవు మే 27న అని ప్రకటించారు.
తాజా మార్పు సందర్భంగా ప్రభుత్వం బక్రీద్ సెలవును మే 28 వ తేదీకి మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల మే 28వ తేదీన జరగాల్సిన ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను వాయిదా వేశారు. కేవలం 28వ తేదీన జరిగే పరీక్షలు మాత్రమే వాయిదా వేశారు. మిగిలిన పరీక్షలు అన్నీ యధావిధిగా జరుగుతాయి. 28వ తేదీన జరగాల్సిన పరీక్షలు జూన్ 5వ తేదీన నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
