10 pm | మన్యంలో గిరిజనుడు దారుణ హత్య..!

10 pm | మన్యంలో గిరిజనుడు దారుణ హత్య..!

  • మూట రమేష్‌ను పదునైన కత్తితో పీక కొచి చంపిన వైనం
  • లక్కవరం గ్రామంలో గతంలో జరిగిన హత్య నేపధ్యంలోనే హత్య?
  • మూట రామయ్య హత్య కేసులో నిందితుడుగా మూట రమేష్‌
  • ఘటన స్థలాన్ని పరీశీలించిన చింతూరు ఏఎస్పీ హేమంత్‌ కుమార్‌

10 pm | చింతూరు (పోలవరం జిల్లా), ఆంధ్రప్రభ : చింతూరు మన్యంలో గిరిజనుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరగగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలో గల లక్కవరం గ్రామానికి చెందిన మూట రమేష్‌ (గుండయ్య) (37) అనే యువకుడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మూట రమేష్‌ను పదునైన ఆయుధమైన కత్తి అత్యంత దారుణంగా పీకను కోచి హత్య చేసినట్లు ఉంది. మృతుడి ఇంటికి దూరంగా ఈ హత్య జరిగింది. లక్కవరం గ్రామం చింతూరు – రాజమండ్రి ప్రధాన రహదారికి ప్రక్కనే ఉన్న అంగన్వాడీ భవనానికి అతి సమీపంలో పాడుబడ్డ ఇంటి ప్రక్కన మృతుడి మృతదేహం ఉంది.

10 pm | గురువారం ఉదయంలో వెలుగులోకి..

ఆ గ్రామంలో ఒక శుభకార్యం సందర్భంగా బుధవారం రాత్రి డీజే ఏర్పాటు చేశారు. ఈ డీజే కార్యక్రమంలో మూట రమేష్‌ రాత్రి 12 నుండి 1 గంట వరకు డీజే కార్యక్రమంలో డ్యాన్స్‌ వేసినట్లు స్థానికులు చెపుతున్నారు. ఆ తరువాత 1 గంట దాటిన తరువాతే హత్య జరిగినట్లు తెలుస్తుంది. డీజే కార్యక్రమం దగ్గర రమేష్‌ భార్య రాత్రి 10 గంటల వరకు ఉంది. నిద్ర వస్తుందని 10.30 గంటలకు ఇంటికి వెళ్దామని రమేష్‌ను భార్య పిలువుగా నువ్వు వెళ్ళు నేను తరువాత వస్తాను అని చెప్పినట్లు భార్య గంగమ్మ మీడియాకి తెలిపింది. తెల్లవారిన రాకపోయే సరికి రమేష్‌ స్నేహితులకు ఫోన్లు చేసి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో అంగన్వాడీ సమీపంలో ఒక మహిళ రాత్రి అరవేసిన బట్టలు తీసుకునేందుకు రాగా అక్కడ పడుకొని ఉన్నట్లు వ్యక్తిని గమనించి స్థానికులకు చెప్పడంతో గ్రామస్తులు రమేష్‌ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

10 pm | పాత కక్షల నేపధ్యంలోనే…

చింతూరు మండలంలోని లక్కవరం గ్రామంలో గత ఏడాది ఆఘస్టు 25 వ తేదిన మూట రామయ్య అనే వృద్ధుడుని మంత్రగాడనే నేపంతో ఆ గ్రామానికి చెందిన నలుగురు కలసి హత్య చేశారు. ఆ హత్య కేసులో మొత్తం నలుగురు నిందితులల్లో మూట రమేష్‌ (గుండయ్య) ఒక నిందితుడిగా ఉన్నాడు. రమేష్‌ గత ఏడాది డిశంబర్‌ లో బెయిల్‌ మీద జైలు నుండి విడుదల అయి వచ్చాడు. రమేష్‌ జైలుకెళ్ళడంతో తన తల్లి మూట పెంటమ్మ మానసికంగా కృంగిపోయి గత ఏప్రిల్‌లో మృతి చెందినట్లు కొడలు గంగమ్మ తెలిపింది. ఈ పాత కక్షల నేపధ్యంలోనే మూట రమేష్‌ హత్య జరిగినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడు మూట రమేష్‌కి భార్య గంగమ్మ, ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు.

10 pm | ఘటన స్థలాన్ని పరీశీలించిన ఏఎస్పీ..

ఈ విషయం గ్రామస్తుల ద్వార తెలుసుకున్న చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్‌ కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మూట రమేష్‌ మృతదేహం ఉన్న ప్రదేశాన్ని సందర్శించి పరీశీలించారు. మృతదేహాం ఉన్న ఘటన స్థలం చుట్టు ప్రక్కల మొత్తం గాలించి హత్యకు సంబంధించిన క్లూస్‌ల కోసం అన్వేషించారు.

10 pm | విచారణ చేస్తున్నాం : ఏఎస్పీ బొడ్డు హేమంత్‌ కుమార్..

లక్కవరం గ్రామంలో జరిగిన మూట రమేష్‌ హత్య ఘటనపై విచారణ చేస్తున్నాం. హత్యకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. గత ఏడాది ఆఘస్టులో ఇదే గ్రామానికి మూట రామయ్య హత్య కేసులో మూట రమేష్‌ నిందితుడిగా ఉన్నాడు. ఈ కోణంలో విచారణ చేస్తున్నాం. లక్కవరం గ్రామానికి చెందిన కొందరి అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. అనుమానితులను విచారిస్తున్నాం. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం.

పోలీసులు కేసు నమోదు..

మూట రమేష్‌ హత్య కేసును చింతూరు సర్కిల్‌ మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిర్వహించారు. చింతూరు సీఐ గోపాల క్రిష్ణ, మోతుగూడెం ఎస్సై నాసీర్‌ హుస్సెన్‌, విఆర్‌ పురం ఎస్సై సాదిక్‌లు ఘటన స్థలాన్ని సందర్శించి, మృతుడి మృతదేహాన్ని పరీశీలించి హత్యకు దారి తీసిన విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.

click here to read more : నలుగురు కలప స్మగ్లర్ల అరెస్టు..

click here to read more

Leave a Reply