Revanthreddy | పార్కింగ్ సమస్యల పరిష్కారంపై కీలక చర్చలు

Revanthreddy | పార్కింగ్ సమస్యల పరిష్కారంపై కీలక చర్చలు
Revanthreddy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత రెడ్డితో యూబర్ సీఈవో దారా ఖోస్రోషాహి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యలు, భవిష్యత్ పట్టణ అభివృద్ధి, ఉబర్ విస్తరణ ప్రణాళికలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
ప్రధాన నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఉబర్ ప్రతినిధులకు సూచించారు. మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరినట్లు సమాచారం.
హైదరాబాద్‌లో ఉన్న ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను మరింత విస్తరిస్తున్నట్లు దారా ఖోస్రోషాహి వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ కార్యాలయం నిర్మాణంపై ఆసక్తి వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విస్తరణ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
