మహిళల భద్రతపై కౌతాళంలో అవగాహన ..

మహిళల భద్రతపై కౌతాళంలో అవగాహన ..
కౌతాళం, ఆంధ్రప్రభ : కౌతాళం మండల పరిషత్ కార్యాలయంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, బాలికల విద్య, వరకట్న వేధింపులు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ మహిళలు వేధింపులపై మౌనంగా ఉండకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో OTPలు, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, బాలికలకు విద్య ఎంతో ముఖ్యమని పేర్కొంటూ “ఆడపిల్లలకి అక్షరమే ఆత్మవిశ్వాసం” అని తెలిపారు. సీఐ యుగంధర్ బాబు మాట్లాడుతూ మహిళల భద్రత ప్రతి కుటుంబ బాధ్యత అని, బాధితులకు పోలీసులు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
