జాయింట్ కలెక్టర్ గా సూరజ్ ధనుజయ్ నియామకం..
జాయింట్ కలెక్టర్ గా సూరజ్ ధనుజయ్ నియామకం..
రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా సూరజ్ ధనుజయ్ ను నియమిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాదు ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నంబర్ 950 ని బుధవారం జారీ చేశారు. గతంలో ఇక్కడ జెసీగా పనిచేసి న కొల్లా బత్తుల కార్తీక్ గత నెలలో బదిలీపై విజయవాడ హెడ్ క్వార్టర్ కు బదిలీ అయ్యారు.
గత కొద్ది రోజులుగా ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న సూరజ్ ధనుజయని నంద్యాల జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఈ బదిలీ వెంటనే అమలులోకి వస్తుందని ప్రిన్సిపల్ సెక్రెటరీ సాయిప్రసాద్ ఉత్తర్వులు పేర్కొన్నారు.
