జనగణన, ఓటరు సర్వేపై ఉపాధి కూలీలకు అవగాహన

జనగణన, ఓటరు సర్వేపై ఉపాధి కూలీలకు అవగాహన
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలతో చెరువు వద్ద సమావేశం నిర్వహించి దేశవ్యాప్త జనగణన, ఎస్ఐఆర్ సమగ్ర ఓటరు సర్వేపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్ మాట్లాడుతూ.. జనగణన అధికారులకు అవసరమైన సమాచారం అందించాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్, బ్యాంకు ఖాతా, పాన్ కార్డు వివరాలు ఇవ్వవద్దని సూచించారు. ప్రతి ఓటరు బీఎల్ కు సరైన వివరాలు అందించి తమ ఓటును కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
