ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా బండపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలలో ఆంజనేయస్వామి దేవాలయాలను ప్రత్యేకంగా రంగురంగు పూలు, పచ్చని తోరణాలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారినీ దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది .భజనలు అన్నదాన కార్యక్రమాలు శోభాయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండపల్లి దేవస్థానం చైర్మన్ పెండ్యాల సమ్మిరెడ్డి కమిటీ సభ్యులు మందల కృష్ణారెడ్డి గ్రామ సర్పంచ్ మ్యాకల లతా రాజు మాజీ సర్పంచ్ నామని రాజేందర్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కలిగి ఉండాలని తెలిపారు కాగ జైశ్రీరామ్ జై హనుమాన్ నినాదానంతో గ్రామాలలో భక్తి వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

Leave a Reply