గరిడేపల్లి ఎస్సైగా శ్రీకాంత్ గౌడ్……

గరిడేపల్లి ఎస్సైగా శ్రీకాంత్ గౌడ్……
గరిడేపల్లి, ప్రభన్యూస్ : గరిడేపల్లి మండల నూతన ఎస్సైగా శ్రీకాంత్ గౌడ్ నియమితులయ్యారు. జిల్లాలో జరిగిన పోలీసు అధికారుల సాధారణ బదిలీలలో భాగంగా ఆయనను గరిడేపల్లికి కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాంత్ గౌడ్ ప్రస్తుతం ఆత్మకూర్ (ఎస్) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ శాంతిభద్రతల పరిరక్షణలో, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో ఆయన కీలక పాత్ర పోషించి సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ అనుభవంతో ఇప్పుడు గరిడేపల్లి మండల బాధ్యతలను చేపట్టనున్నారు.
మండలంలో పెరుగుతున్న నేరాలను అదుపు చేయడం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం మరియు ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేయనున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తూనే, చట్టవిరుద్ధ పనులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తారని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, గరిడేపల్లి ఎస్సైగా పనిచేసిన ఎస్సై చలి కంటి నరేష్ హుజూర్ నగర్ కు బదిలీ అవ్వడంతో ఆయన స్థానంలో శ్రీకాంత్ గౌడ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నియామకం పట్ల పలువురు మండల నేతలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
