​రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

​రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండలం తాళ్లసింగారానికి చెందిన బాతరాజు గణేష్ (52) ఆదివారం రాత్రి పెద్దకాపర్తిలో ఒక ఫంక్షన్‌కు హాజరై తన స్కూటీపై తిరిగి వస్తుండగా, భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ​ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గణేష్‌ను తొలుత నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆపై పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుని అన్న కుమారుడు బాతరాజు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.

Leave a Reply