నిర్వహణ పనులతో ప్రయాణికులకు కీలక సూచన

నిర్వహణ పనులతో ప్రయాణికులకు కీలక సూచన

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. నిర్వహణ పనుల కారణంగా మే 11, 12 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

వివిధ నిర్వహణ సంబంధిత పనుల నేపథ్యంలో నగరంలోని కొన్ని కీలక మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కానున్నాయి. సోమవారం, మంగళవారం రోజుల్లో ఈ మార్పులు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

రైళ్ల రద్దుతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రద్దైన, పాక్షికంగా రద్దైన రైళ్ల వివరాలను అధికారిక ప్రకటనల ద్వారా తెలుసుకోవాలని కోరింది.

పూర్తిగా రద్దయిన రైళ్లు:

ఉమ్దానగర్ – లింగంపల్లి (ట్రైన్ నెం. 47164)
లింగంపల్లి – ఫలక్ నుమా (ట్రైన్ నెం. 47191)
ఫలక్ నుమా – లింగంపల్లి (ట్రైన్ నెం. 47170)
ఫలక్ నుమా – ఉమ్దానగర్ (ట్రైన్ నెం. 47250)

పాక్షికంగా రద్దయిన రైళ్లు :

రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లను నిర్ణీత స్టేషన్ల మధ్య నిలిపివేశారు.

లింగంపల్లి – ఉమ్దానగర్ (47210): సికింద్రాబాద్ – ఉమ్దానగర్ మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది.
ఉమ్దానగర్ – లింగంపల్లి (47203): ఉమ్దానగర్ – సికింద్రాబాద్ మధ్య రద్దయింది.
ఫలక్ నుమా – లింగంపల్లి (47157, 47166): ఈ రైళ్లు ఫలక్ నుమా – సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడవవు.
లింగంపల్లి – ఫలక్ నుమా (47179, 47190, 47187): ఈ సర్వీసులు సికింద్రాబాద్ – ఫలక్ నుమా మధ్య పాక్షికంగా నిలిపివేయబడ్డాయి.
నగరంలోని ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే కార్యకలాపాల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply