సాయి అనాథాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం
భీమారం, ఆంధ్రప్రభ : శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త జ్ఞానబోధ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగర శివారులోని పూరిగుట్ట ప్రాంతంలో ఉన్న సాయి అనాథాశ్రమంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కంటేం లక్ష్మీనారాయణ ఈ శిబిరంలో సేవలందించారు.
ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా ఆశ్రమంలోని 21 మంది అనాథ పిల్లలు, 18 మంది వృద్ధులకు మొత్తం 39 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ రవి, డ్రైవర్ సారంగం, ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
