చారిత్రాత్మక కోనేరుకు పూర్వ వైభవం తీసుకొస్తా..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పూర్వికులు నిర్మించిన చారిత్రాత్మక కోనేరుకు పూర్వ వైభవం తీసుకొస్తానని కొత్తపల్లి సర్పంచ్ ఆర్. నర్సిములుఅన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి ఆంజనేయస్వామి కోనేరు పునరుద్ధరణపనులుచేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పురాతనకోనేరు ఆదరణకు నోచుకోలేక నిరూపయోగంగా మారడంతో ముళ్ళ పొదలు చెత్తాచెదరం పేరుకుపోయిందనిఅన్నారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోనేరు శుభ్రపరుస్తూ ముళ్ళ పొదలు చెత్తాచెదరం తొలగించినట్లు తెలిపారు. ప్రజలు భక్తుల సహకారంతో కోనేరు పునరుద్ధరణ పనులు చేపట్టి ఉపయోగంలోకి తీసుకురావడంతో పూర్వికులు నిర్మించిన చారిత్రాత్మక కోనేరు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. దాతలు భక్తులు ఆలయ అభివృద్ధితోపాటు పురాతన కోనేరు పునరుద్ధరణకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply