ప్రజా సేవతోనే సంతృప్తి…
ప్రజా సేవతోనే సంతృప్తి…
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పేదల పాలిట అండ బొండా ఉమా..
పలువురు ప్రశంసలు
పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు వారి కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు, ప్రజా సేవనే పరమావధిగా భావిస్తూ,పేద కుటుంబాలకు తన సొంత నిధులతో అండగా నిలుస్తూ నిజమైన ప్రజానాయకుడిగా పలువురి ప్రశంసలు అందుకొంటున్నారు.
సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పెన్షన్ అందక,కుటుంబ పోషణకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 25వ డివిజన్‌కు చెందిన ఇనుకుల సీతామహాలక్ష్మికి, 61వ డివిజన్ ప్రశాంతి నగర్‌కు చెందిన నిజాంపట్నం సుధాకర్కి ప్రతినెలా రూ.4,000 చొప్పున తన సొంత నిధుల నుండి పెన్షన్ అందజేస్తూ వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రజల కష్టాలను తన కుటుంబ సమస్యలుగా భావించి స్పందించడం బొండా ఉమా ప్రత్యేకతగా ప్రజలు పేర్కొంటున్నారు.

ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందుగా స్పందించే నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు గారేనని స్థానికులు కొనియాడుతున్నారు. పదవి కోసం కాదు, ప్రజల ప్రేమ కోసం పనిచేసే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ప్రభుత్వం చేయాల్సిన సహాయం ఆలస్యం అయినా, పేదల కష్టాలు ఆగవని భావించి తన సొంత డబ్బులతో ముందుకు రావడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాష్, మాచెర్ల గోపినాద్, బుదాల సురేష్, కంచేటి నాగరాజు, డిడి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
