చలివేంద్రం ఏర్పాటు

చలివేంద్రం ఏర్పాటు

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: ఈ వేసవిలో పెన్షన్ దారులు మండుటెండలో ఇబ్బందులు పడకుండా, దాహం తీర్చడం కోసం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పోస్టాఫీసు కార్యాలయం వద్ద సోమవారం గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ తాగు నీటి సౌకర్యన్నీ ( చలి వేంద్రాన్ని ) ఏర్పాటు చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పెన్షన్ తీసుకోవడానికి వచ్చే వృద్ధులు, వికలాంగులు, మహిళల దాహార్తిని తీర్చేందుకు చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ దంపతులకు పెన్షన్ దారులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులు తదితరులు పాల్గొన్నారు.