అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు..

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు..
మున్సిపల్ చైర్ సునీత, వైస్ చైర్ పర్సన్ రామా
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్ , వైస్ చైర్ పర్సన్స్
కేసముద్రం, (ఆంధ్రప్రభ): అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రజా ప్రభుత్వం ఇస్తుందని మున్సిపల్ చైర్ భానోత్ సునీత, వైస్ చైర్ పర్సన్ అల్లం రామా అన్నారు. ఆదివారం కేసముద్రం మున్సిపాలిటీ విలేజ్ కేసముద్రం గ్రామ పరిధిలో 8 వార్డుకి చెందిన ఎస్.కె తహేర ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న, కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావులు పాల్గొని భూమి పూజ నిర్వహించి ముగ్గు పోశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేముల భారతి శ్రీనివాస్ రెడ్డి ,కానుకల సుభద్ర రాంబాబు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
