మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

  • నల్ల రిబ్బన్లతో కార్మికుల భారీ ర్యాలీ
  • డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం..
  • తొర్రూరులో మానవహారం నిర్వహించిన సిబ్బంది

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. చర్చలు విఫలం కావడం, తోటి కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నిరసనగా తొర్రూరు డిపో కార్మికులు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.

41 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేయడంలో తాము ఎంతో కృషి చేశామని, కానీ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలి. పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీ (PRC)లను

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు బీఆర్ఎస్, సీపీఐ, సీపీఐ (న్యూ డెమోక్రసీ) పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి కార్మికుల ప్రాణాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Leave a Reply