పోషక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం…

పోషక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం…
నచ్చన్ ఎల్లాపూర్ సర్పంచ్ బొడ్డు స్పందన
కడెం, ఆంధ్రప్రభ : గర్భిణీ మహిళలు, బాలింతలు, పిల్లలు పోషక ఆహారం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న అన్నారు కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న ఆధ్వర్యంలో పోషణ పక్వడ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
గ్రామంలోని మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోషకాహారం ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం, పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, సరైన పోషణ దేశానికి వెలుగని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి కుటుంబం రోజువారీ ఆహారంలో పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు వంటి సమతుల్య ఆహార పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ప్రత్యేక శ్రద్ధతో పోషకాహారం తీసుకోవాలని అన్నారు.
అంగన్వాడీ సిబ్బంది పోషణ పక్వడ కార్యక్రమం ఉద్దేశాలు వివరించి, ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లక్ష్మి, కార్యదర్శి శాంత, పి ఎస్ స్కూల్ టీచర్ రాగసుధ గ్రామస్తులు లక్ష్మణ్ , మహిళా సంఘ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
