తమిళనాడులో ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..

తమిళనాడులో ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాల్లో వేలాది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచే ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో క్యూలలో నిలబడి ఓటు వేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా గెలుపు కోసం గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా హీరో విజయ్ పార్టీ పెట్టడం.. అన్ని సీట్లకు పోటీ చేయడంతో ఈసారి ఎన్నికల రసవత్తరంగా మారాయి. ప్రముఖ నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా, భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశముందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు నిర్ణయాత్మకంగా ఉండనున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సినీ నటులు రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, ధనుష్, విజయ్ సేతుపతి, సీఎం స్టాలిన్, విజయ్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
