మొక్కజొన్న సంచుల చోరీలో దొంగల పట్టువేత

మొక్కజొన్న సంచుల చోరీలో దొంగల పట్టువేత
కుంటాల, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు కుంటాల ప్రధాన రహదారిపై 50 కిలోల మొక్కజొన్న బస్తాల గల 110 సంచులను ఈనెల 4వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఎత్తుకెళ్లిన దొంగలను బుధవారం పట్టుకున్నారు. బైంసా గ్రామీణ సీఐ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బైంసా పట్టణానికి చెందిన షేహెబాజ్ అహ్మద్, షేక్ అతీఫ్, మొహమ్మద్ సాహిల్ ఉద్దిన్, షేక్ జలాల్ అలియాస్ షేక్ అర్బాజ్, షేక్ నోమన్ అలియాస్ షేక్ మన్నాన్, మొక్కజొన్న సంచులను కుంటాల కల్లూరు ప్రధాన రహదారిపై వెంకూర్ గ్రామానికి చెందిన రైతు మగ్గిడి నారాయణ చోరీ అయిన మరుసటి రోజు తెల్లవారుజామున బాధిత రైతు పంట క్షేత్రానికి వెళ్లి చూడగా ధాన్యం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు చేశారు.
పోలీసులు పూర్తిస్థాయిలో అన్ని కోణాల్లోని దర్యాప్తు సేకరించి నిందితులను పట్టుకున్నారు. నిందితులు గత కొంత కాలం నుండి చోరీలకు పాల్పడుతూ మహారాష్ట్రలోని ధాన్యం విక్రయించి సొమ్ము చేసుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారని, ధాన్యం రహదారిపై ఉండటాన్ని గమనించిన నిందితులు ఎత్తుకెళ్లారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సిసి ఫుటేజ్ లో కాల్ డీటెయిల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్టు బైంసా గ్రామీణ సీఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
నిందితులను బుధవారం ఉదయం తెల్లవారుజామున బోకర్ ఎక్స్ రోడ్డు సమీపంలో నలుగురు నిందితులను పట్టుకున్నట్టు సీఐ వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుంచి 75 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని నిందితులను ఒకరు పరార్ లో ఉండగా నలుగురిని రిమాండ్ కు తరలించినట్టు పేర్కొన్నారు. దొంగతనం కేసు ను చాకచక్యంగా చేదించి నిందితులను పట్టుకున్న కుంటాల ఎస్ఐ సి అశోక్ పోలీస్ సిబ్బంది కె రంజిత్ కుమార్, జి రాజేందర్, జె శంకర్ రావులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించినట్టు బైంసా గ్రామీణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
