బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం

బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం

మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : చలివేంద్రాలు ఏర్పాటు చేసి వేసవి దాహార్తిని తీర్చటం అభినందనీయమని నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి అన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లంశెట్ల రమేష్ బాబు తల్లిదండ్రులు కీర్తిశేషులు వల్లంశెట్ల జానకి రామయ్య, రంగమ్మ ల జ్ఞాపకార్థం నేరేడుచర్ల జాన్ పహాడ్ రోడ్డు పాత ఎన్ఎస్పి క్యాంపు స్థలంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు.

నేరేడుచర్ల మున్సిపాలిటీకి వివిధ కార్యకలాపాల నిమిత్తం వచ్చి వెళ్లే బాటసారుల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛమైన, చల్లటి మంచినీటిని అందజేస్తున్న రమేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు, వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply