జగద్గురు ఆదిశంకరాచార్య నగరోత్సవం..

జగద్గురు ఆదిశంకరాచార్య నగరోత్సవం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్బంగా శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం నగరోత్సవ ఊరేగింపు మహామండపం నుండి వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాలు, కోలాట నృత్యాలు, కూచిపూడి నృత్య కళాకారుల అభినయం, భజన సంకీర్తనలు, ఆది శంకరుల వేషధారణతో చిన్నారుల కోలాహలంతో రంగరంగ వైభవం గా ప్రారంభమైంది. ప్రత్యేక రధంలో ఆదిశంకరుల ప్రతిమను ఉంచి ఊరేగింపు ప్రారంభం అయింది.

ఆది శంకరుల వేషధారణతో చిన్నారులు కాషాయవస్త్రాలతో నడుస్తుండగా, ఆంధ్ర నృత్యం బృందం అభినయం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ వేద పండితులు, అర్చకులు, ఆలయసిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు ప్రారంభం అయింది. ఆలయ ధర్మ కర్తలమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఊరేగింపు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఊరేగింపు శ్రీ కనకదుర్గా నగర్, రధమ్ సెంటర్, వినాయక ఆలయం, కెనాల్ రోడ్ నుండి భక్తుల కోలాహలం నడుమ మరళా దేవస్థానం చేరుకుంది. శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో శ్రీ చక్రం ప్రతిష్టించి, అమ్మవారి ఆలయంతో విశేషఅనుబంధం గల ఆది శంకరుల జయంతి సందర్బంగా విశేషపూజలు, నగరోత్సవం ప్రత్యేక శ్రద్దతో నిర్వహించడమైనది.

Leave a Reply