బీఆర్ఎస్ కీలక సమావేశం..

బీఆర్ఎస్ కీలక సమావేశం..

కేసీఆర్ అధ్యక్షతన రజతోత్సవ ముగింపు వేడుకలు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపును పురస్కరించుకుని ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో ఒక ప్రత్యేక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వాల పునరుద్ధరణతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి పార్టీ ముఖ్య నేతలందరికీ అధిష్టానం నుంచి పిలుపు అందింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు (ఎంపీలు), శాసనమండలి (ఎమ్మెల్సీ), శాసనసభ (ఎమ్మెల్యే) సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్ దిశానిర్దేశం చేసేందుకు ఈ భేటీ కీలకం కానుంది.

Leave a Reply