Personality Rights | అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..

Personality Rights | అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..

ఇకపై ఆ పనులు చేస్తే కఠిన చర్యలు!

Personality Rights | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా పేరు, ఫోటో, గొంతు లేదా ఆయనకు సంబంధించిన ఎలాంటి గుర్తింపు చిహ్నాలను వాణిజ్యపరంగా ఉపయోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి అల్లు అర్జున్ గొంతును క్లోనింగ్ చేయడం, డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం లేదా ఆయన రూపంతో చాట్‌బాట్‌లను తయారు చేయడంపై కోర్టు పూర్తిస్థాయిలో నిషేధం విధించింది.

ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా అసభ్యకరమైన లేదా అభ్యంతరకరమైన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరును, ఫోటోలను టీ-షర్టులు, పోస్టర్లు లేదా ఇతర వస్తువుల విక్రయాల కోసం వాడుకోవడం కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తుందని కోర్టు పేర్కొంది. ల్లు అర్జున్ కేవలం నటుడే కాదని, ఆయన సంభాషణలు (Dialogues), మేనరిజమ్స్ కోట్లాది మందిని ప్రభావితం చేస్తాయని, అవి ఆయన వ్యక్తిగత ఆస్తి అని జస్టిస్ తుషార్ రావు గెడెల తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు.

ఇటీవల కాలంలో ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంస్థలు, వ్యక్తులు ఆయన అనుమతి లేకుండా AI టెక్నాలజీని వాడుతూ “ఫేక్ కాల్ పుష్ప” వంటి యాప్‌లను, అశ్లీల వీడియోలను సృష్టిస్తున్నారు. దీనివల్ల తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతోందని ఆయన కోర్టును ఆశ్రయించారు.

Leave a Reply