మైనర్ బాలికపై దురాగతం…

మైనర్ బాలికపై దురాగతం…
- యువకుడిపై పోక్సో కేసు నమోదు
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన స్వామి అనే యువకుని పై పొక్స్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెన్నూరు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల ప్రకారం కిష్టంపేట గ్రామానికి చెందిన స్వామి అదే గ్రామానికి చెందిన 15 సంవత్సరాల మైనర్ బాలికను గత సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రేమ పేరుతొ వెంబడించి నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడంతో పాటు మైనర్ బాలికను వివాహం చేసుకొని మానసికంగా వేధించి ఆమెను ఇంటి నుంచి గెటవేసినట్లు బాధితురాలు ఫిర్యాదు మేరకు స్వామి పై పొక్స్ కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు పేర్కొన్నారు.
