TG | సమ్మెపై సర్కార్ క్లారిటీ..

TG | సమ్మెపై సర్కార్ క్లారిటీ..

ఆర్టీసీ సమ్మెపై కీలక ప్రకటన!

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల డిమాండ్లపై సానుకూల దృక్పథంతో ఉన్న ప్రభుత్వం, సమస్యల పరిష్కారానికి నలుగురు అధికారులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించడానికి నలుగురు అధికారులతో కమిటీని నియమించింది. కార్మిక ప్రతినిధులు తమ సమస్యలను ఈ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం కోరింది.

అధికారుల నివేదిక అందిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి , ఇతర ఉన్నతాధికారులతో కలిసి చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. నిర్ణయాల ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఫలితం సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రతిరోజూ దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఆర్టీసీపైనే ఆధారపడి ఉన్నారని, ఈ రవాణా వ్యవస్థ వారికి ఒక ‘లైఫ్ లైన్’ (జీవనరేఖ) వంటిదని ప్రభుత్వం గుర్తు చేసింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు ప్రభుత్వంపై కూడా ఉందని, అందరం కలిసి సంస్థ పరిరక్షణ కోసం పనిచేయాలని పిలుపునిచ్చింది.

Leave a Reply