అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి….

అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి….

ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి…

బిక్కనూరు, ఆంధ్రప్రభ : అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గల రైతు వేదికలో 77 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను ఆయా గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సునీత, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, పశు వైద్యాధికారి దేవేందర్ , బిజెపి మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్, లక్ష్మీ దేవునిపల్లి గ్రామ సర్పంచ్ జె లింగారెడ్డి, అంతంపల్లీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మండల జనరల్ సెక్రెటరీ తిరుమలేష్, పొన్నాల రంజిత్ ఉపాధ్యక్షులు నరేందర్,  నర్సింహులు సీనియర్ రెడ్డి గారి రమేష్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు , ఉప సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు  నాయకులు గ్రామ అధ్యక్షులు బిజెపి నాయకులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply