మహిళలపై బీజేపీ కపట ప్రేమ…

మహిళలపై బీజేపీ కపట ప్రేమ…

ఎమ్మెల్యే బొజ్జు పటేల్…
బిల్లులు వీగిపోతాయని బిజెపికి ముందే తెలుసు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులుమహిళ బిల్లు డీలిమిటేషన్, జన గణన, ఆమోదం కావని వీగిపోతాయని బిజెపి కేంద్ర ప్రభుత్వానికి ముందే తెలిసిందని, నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా బిల్లు ఆమోదంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని బిజెపి పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేయడం జరుగుతుందని, బీజేపీకి మహిళలంటే గౌరవం లేదని కపడ ప్రేమతో కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే విధంగా ప్రచారాలు చేస్తుందని, డీలిమిటేషన్, (పునర్విభజన) బిల్లు వల్ల దక్షిణాది ప్రాంత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే చెప్పారని ఆయన అన్నారు.

బిజెపి నాలుగోసారి కేంద్రంలో అధికారంలో రావడానికి కుట్ర చేసిందని అన్నారు. 2023లో కేంద్రం నారీ సతీమణి పేరిట ప్రవేశపెట్టిన మహిళ బిల్లుకు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమోదం తెలపడం జరిగిందని అన్నారు. డీలిమిటేషన్ బిల్లుతో అన్యాయం జరుగుతుందని ఆ బిల్లును వ్యతిరేకించడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలోని ఎంపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా మహిళా బిల్లు ప్రవేశ పెట్టేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలుపుతుందని అన్నారు.

నియోజకవర్గాల పునర్విభజన లో అన్యాయం జరిగిందని అన్నారు. బిజెపి పార్టీ నాలుగోసారి కేంద్రంలో అధికారంలో రావడానికి కుట్రతో ఈ బిల్లులు ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. బిల్లుల వల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న నియోజకవర్గస్థానాలు పార్లమెంటు స్థానాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. చీకటి రాజకీయ జెండాగా అన్యాయం జరిగే విధంగా కుట్ర చేసినందుకే కాంగ్రెస్, విపక్షపార్టీలు ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

బిజెపి పార్టీకి మహిళలపై గౌరవం లేదని ఆ పార్టీ తరపున మహిళా ప్రజాప్రతినిధులకు ఏమైనా ఉన్నత పదవులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు రాష్ట్రపతి స్పీకర్ లాంటి పదవులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ జనని అన్నారు.

బిజెపి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పై చేస్తున్న అసత్య ప్రచారాని ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇవిలేక సమావేశంలో ఆదిలాబాద్ డిసిసి ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భానోత్ జై వంతరావు, ఉట్నూర్ మాజీ సహకార చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ బిరుదుల లాజర్,ఉట్నూర్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఆత్రం తిరుపతి, ఘన్పూర్ సర్పంచ్ మడావి ఆనందరావు, మాజీ సర్పంచులు మరుస కోల తిరుపతి, జాదవ్ జగదీష్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మెస్రం భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply