ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఇంటెక్ కర్నూలు చాప్టర్ ఆధ్వర్యంలో నగరంలోని కేఎన్ఆర్ హైస్కూల్, వి.ఆర్. కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఇంటెక్ ప్రతిజ్ఞ చేయించడంతో పాటు యంగ్ ఇంటెక్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా చాప్టర్ కన్వీనర్ బోయా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో వారసత్వ సంరక్షణపై అవగాహన పెంపు అత్యవసరమని తెలిపారు. అనంతరం విద్యార్థులు, సభ్యులు తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలోని గంగమ్మ గుడి, కొండారెడ్డి బురుజు అలాగే కే.సీ. కాలువ ప్రాంతాలను సందర్శించి వాటి చారిత్రక, భౌగోళిక ప్రాముఖ్యతపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయులు, వాలంటీర్ల చురుకైన భాగస్వామ్యంతో ఘన విజయాన్ని సాధించింది.

Leave a Reply