అక్రమ ఇసుక రవాణా పై అధికారులు మెరుపు దాడి…

అక్రమ ఇసుక రవాణా పై అధికారులు మెరుపు దాడి…
- పోలీసులకు పట్టుబడ్డ మూడు ట్రాక్టర్లు..
- కేసు నమోదు..
బూర్గంపాడు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామం కిన్నెరసాని వాగు నుండి శనివారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి మూడు ట్రాక్టర్లను బూర్గంపాడు పోలీసులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను స్టేషన్ తరలించి బైండ్వర్ కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత ట్రాక్టర్లు స్థానిక తాసిల్దార్ కు అప్పగించడంతో మైనింగ్ శాఖకు బదిలాయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బైండ్వర్ కేసులు నమోదైన అటువంటి ట్రాక్టర్లు మైనింగ్ శాఖ విధించినటువంటి జరిమానాతో రిలీజ్ చేయడం జరుగుతుందని అట్టి ట్రాక్టర్లు మరల పట్టుబడితే లక్ష రూపాయలు వరకు జరిమానా ఉంటుందని కట్టని యెడల ఆరు నెలలు జైలు శిక్ష కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.
అక్రమ ఇసుక రవాణా చేస్తే ఉపేక్షించేది లేదు..
మండలాల్లో అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా జరిగితే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేసినటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ విషయంలో ఆలుష్యం లేకుండా పంచాయతీ అధికారులు ఇచ్చినటువంటి ట్రాక్టర్ల నంబర్ల పేరు మీద ఉన్న వాటికే కూపన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. అలా కూపన్ లేకుండా అభివృద్ధి పేరుతో అక్రమ రవాణా జేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
